ఎలాంటి సాయం కావాలన్నా అండగా ఉంటా!

Sat,February 2, 2019 04:59 PM

సిద్ధిపేట: జిల్లా కేంద్రంలోని టీటీసీ భవన్‌లో ఎంఈవోలు, ప్రభుత్వ మోడల్, కస్తూర్భా పాఠశాల ప్రధానోపాధ్యాయులతో ఎమ్మెల్యే హరీష్‌రావు సమావేశమయ్యారు. పదో తరగతి ఫలితాల్లో తెలంగాణ వ్యాప్తంగా మొదటిస్థానంలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. ప్రతీ పాఠశాలలో 95శాతం ఉత్తీర్ణత దాటితేనే సిద్ధిపేట జిల్లాకు ప్రథమస్థానం దక్కుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 10 పాయింట్లు సాధించిన విద్యార్థులకు తన వంతుగా రూ.25వేల నజరానా అందిస్తానని చెప్పారు.


ఉత్తమ ఫలితాల కోసం కష్టపడిన ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను ఘనంగా సన్మానిస్తామన్నారు. పదోతరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు చేపట్టాలి. విద్యార్థులకు స్నాక్స్ అందించాలి. ఎలాంటి సాయం కావాలన్నా అండగా ఉంటా. పాఠశాలల్లో ఖాళీ స్థలం ఉంటే తప్పనిసరిగా మొక్కలు నాటాలని.. ఈ కార్యక్రమంలో విద్యార్థులను భాగస్వాములను చేయాలని సూచించారు. ప్లాస్టిక్ నిర్మూలనపై కూడా విద్యార్థుల్లో అవగాహన కల్పించాలి. చిన్నతనం నుంచే విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందిస్తే.. ఒక మంచి సమాజ నిర్మాణానికి పునాది వేసినట్లవుతుందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని క్రీడా మైదానంలో హ‌రీశ్ రావు క్రికెట్ కూడా ఆడారు.

4223
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles