పజ్జన్నా.. పద్మంలా వికసించాలి : హరీశ్ రావు

Mon,February 25, 2019 10:57 AM

MLA Harish Rao praises on Deputy Speaker Padmarao Goud

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్‌పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశంసల వర్షం కురిపించారు. శాసనసభలో హరీశ్ రావు మాట్లాడుతూ.. ఏ హోదాలో ఉన్నా పజ్జన్నగా పిలుచుకునే పేరు మీకు దక్కింది. మీరు కూడా ఆప్యాయతతో, ప్రేమతో పలుకరిస్తూ చిరునవ్వుతో నియోజకవర్గ ప్రజలందరితో మమేకమైపోయేవారు. ఉద్యమ సహచరుడిగా, శాసనసభ్యుడిగా, మంత్రిగా మీతో కలిసి పని చేసే అవకాశం తనకు దక్కింది. ఉద్యమం ఉద్ధృతంగా జరుగుతున్న సమయంలో శాసనసభలో పద్మారావుగౌడ్ జై తెలంగాణ నినాదం ఇచ్చినప్పుడు దిక్కులు పిక్కటిల్లేవి అని గుర్తు చేశారు.

గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. కల్లు దుకాణాలను పునరుద్ధరించడంలో మీరు కీలకపాత్ర పోషించారు. గుడుంబాను పూర్తిగా నిషేధించడం మీ హయాంలో జరిగింది. తాటి, ఈత చెట్లపై పన్ను రద్దు చేయడం వల్ల కల్లుగీత కార్మికులకు ఎంతో మేలు చేశారు. పద్మం బురదలో కూడా వికసిస్తోంది. అలాగే పజ్జన్నా.. కార్పొరేటర్, ఉద్యమ నేతగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పదవులు అలంకరించి వికసించారు. ఇప్పుడు కూడా ఈ సభను విజయవంతంగా నడిపించి హుందాతనం తీసుకువస్తారని.. ఆయన పద్మంలా వికసిస్తారనే విశ్వాసం ఉందని హరీశ్ రావు పేర్కొన్నారు.

4376
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles