మెజార్టీలో రికార్డు బ్రేక్ కావాలి : హరీశ్‌రావు

Mon,April 8, 2019 09:51 PM

mla harish rao election campaign at siddipet

సిద్దిపేట: పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చే మెజార్టీతో పీవీ నర్సింహారావు, నరేంద్రమోడీ, రికార్డులు బద్దలు కావాలి.. ముఖ్యమంత్రి కేసీఆర్ దీవెనతో సిద్దిపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశా.. అభివృద్ధి అయినా.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలేవైనా.. మెజార్టీలో సిద్దిపేటనే నంబర్ వన్ అవ్వాలి.. అమేథీ, వారణాసి గురించి కాకుండా యావత్తు దేశం మెదక్ పార్లమెంట్ గురించే మాట్లాడాలి.. అని టీఆర్‌ఎస్ స్టార్ క్యాంపెయినర్, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఉద్ఘాటించారు. సిద్దిపేటలో ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి రోడ్‌షో నిర్వహించిన ఆయన, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పసిపిల్లాడి నుంచి పండు ముసలి వరకు ఎవరిని అడిగినా, సార్ కేసీఆర్ అంటున్నారనని, కొత్త ప్రభాకర్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తుండని చెబుతున్నారన్నారు. రాష్ట్రంలో 16మంది టీఆర్‌ఎస్ ఎంపీలను గెలుస్తున్నామని, ఢిల్లీయే మన దగ్గరికి వచ్చి దండం పెడుతుందని చెప్పారు. కష్టమైనా, సుఖమైనా, పండుగైనా మనతోనే కలిసుండే వ్యక్తి ప్రభాకర్ రెడ్డి అని అన్నారు.

1591
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles