కోమటి చెరువులో చేపలను వదిలిన ఎమ్మెల్యే హరీశ్‌

Sun,August 25, 2019 02:47 PM

mla hareesh rao fishes released in komati cheruvu

సిద్దిపేట: ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌ రావు ఏంచేసినా అందులో ప్రజలకు గానీ, ప్రకృతికి గానీ మంచి చేసే విషయమై ఉంటుంది. ఈరోజు ఆయన స్థానిక నాయకులతో కలిసి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న కోమటి చెరువులో చేప పిల్లలను వదిలారు. ఇక ఇప్పుడు చెరువులో చేప పిల్లలు సందడి చేయనున్నాయని ఆయన అన్నారు.

ఇంతకు ముందు నుంచే ఆయన కోమటి చెరువు అభివృద్ధికి పాటుపడుతున్నారు. జిల్లాలో
అదొక విహారయాత్ర ప్రాంతమయింది. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ తరహాలో లవ్‌ సిద్దిపేట ఏర్పాటు చేశారు. మంచి గార్డెనింగ్‌, వాకింగ్‌ ఏరియా, పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు ఏర్పాటు చేసి ఆహ్లాదకర ప్రాంతంగా మార్చారు. కార్యక్రమంలో స్థానిక నాయకులతో పాటు ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

649
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles