పోతనామాత్యుని పద్య మాధుర్యం పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎర్రబెల్లి

Wed,February 28, 2018 05:38 PM

mla errabelli launches book produced by pothana chaitanya vedika

జనగామ: పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు ఇవాళ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో శ్రీపోతన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయ భవనం, లైబ్రరీ హాల్‌ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ డా.చుక్కా రామయ్య హాజరయ్యారు. అనంతరం శ్రీపోతన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ప్రచురితమైన పోతనామాత్యుని పద్య మాధుర్యం పుస్తకాన్ని ఎర్రబెల్లి ఆవిష్కరించారు. అనంతరం పాలకుర్తి మండలం తిరుమలగిరి గ్రామంలో కనకదుర్గమ్మ బోనాల పండుగ ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

1264
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles