రైతుబంధు చెక్కులను గ్రామాభివృద్ధి కోసం ఇచ్చిన ఎర్రబెల్లి

Tue,May 15, 2018 01:25 PM

MLA errabelli dayakar rao gives Rythu bandhu cheques return for village welfare

జనగామ : జిల్లాలోని పాలకుర్తి మండలం చెన్నూర్ గ్రామంలో ఇవాళ జరిగిన రైతుబంధు పథకం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొని రైతులకు చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చెన్నూర్ గ్రామంలో తనకు వచ్చిన రూ. 12 వేల చెక్కును, అదేవిధంగా తన కుమారుడు ప్రేమ్ చందర్‌రావు పేరున వచ్చిన రూ. 27 వేల చెక్కును ఎమ్మెల్యే గ్రామాభివృద్ధికి కోసం గ్రామ సమన్వయ సమితికి అందజేశారు.

నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పులిచెర్ల గ్రామంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు గడ్డంపల్లి రవీందర్‌రెడ్డి తనకు రైతుబంధు పథకం ద్వారా వచ్చిన రూ. 12 వేల రూపాయల చెక్కును తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి సంఘానికి విరాళంగా ఇచ్చారు.

1829
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles