సీఎం కేసీఆర్‌తోనే అన్ని రంగాల్లో అభివృద్ధి: ఎర్రబెల్లి

Thu,March 15, 2018 06:45 PM

తొర్రూర్: ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గురువారం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం బొమ్మకల్లు గ్రామంలో సబ్సిడీపై మంజూరైన విద్యుత్ మోటర్ పంపు సెట్లను ఆయన రైతులకు పంపిణీ చేశారు. అనంతరం గ్రామ పంచాయితీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి సబ్బండ వర్గాల ఆర్థిక అభివృద్ధికి కోట్ల రూపాయలను విడుదల చేస్తూ దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర నాయకుల పాలనలో తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో వివక్షకు గురైందని ఆరోపించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పాలనలో ఈ ప్రాంతానికి ఒరిగిందేమీలేదన్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగ బలోపేతం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెట్టి పకడ్బందీగా అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

2331
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles