గంగాళంలా ఉన్న చెరువులను తాంబాళంలా

Wed,October 7, 2015 02:29 PM

Mission Kakatiya is great project in telangana, says Ala Venkateshwar reddy

హైదరాబాద్ : గత పాలకుల వల్లే గంగాళంలా ఉన్న చెరువులను తాంబాళంలా మారాయని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. గత పాలకులు చెరువులను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేశారని మండిపడ్డారు. పాలమూరు జిల్లాలో చెరువులు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే మిషన్ కాకతీయ వల్ల చెరువులు నిండి కళకళలాడుతున్నాయని చెప్పారు. ఇరిగేషన్ గురించి తెలిసిన సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయను ప్రవేశపెట్టారు.

తాంబాళంలా ఉన్న చెరువులను గంగాళంలా చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణలో మైనర్ ఇరిగేషన్‌ను ఆంధ్రా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. మిషన్ కాకతీయపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సరికాదు. మిషన్ కాకతీయను హైకోర్టు కూడా ప్రశంసించిందని గుర్తు చేశారు. ఆన్‌లైన్‌లో టెండర్లు పిలిచి ఎక్కడా అవినీతికి తావు లేకుండా మిషన్ కాకతీయ పనులు జరిగాయని స్పష్టం చేశారు. పుట్టగతులుండవు అనే విపక్షాలు రాద్ధాంతం చేయడం పనిగా పెట్టుకున్నాయని ధ్వజమెత్తారు.

1867
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles