జనవరిలో మిషన్ కాకతీయ నాల్గొవదశ పనులు

Tue,December 5, 2017 09:40 PM

Mission kakatiya fourth phase works start in January

హైదరాబాద్: జనవరి మొదటివారంలో మిషన్ కాకతీయ నాల్గొవదశ పనులు ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర భారీనీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. మిషన్ కాకతీయపై మంత్రి హరీశ్‌రావు నేడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మిషన్ కాకతీయ నాలుగో దశకింద 5,703 చెరువులు పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం ఇంకా పెంచాలని అధికారులకు సూచించారు. ఒకసారి తిరస్కరించిన పనులను మరోసారి పంపించే అధికారులపై చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. పనుల్లో అలక్ష్యాన్ని ఉపేక్షించేది లేదని.. అవకతవకలు జరగకుండా చూడాలని పేర్కొన్నారు. పనుల నాణ్యతపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దొన్నారు. ఇకపై 10 రోజులకోసారి మిషన్ కాకతీయపై వీడియో కాన్ఫరెన్స్‌ను చేపట్టనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

1418
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles