మంచిర్యాలలో మిషన్ భగీరథ ట్రయల్ రన్ సక్సెస్

Mon,April 16, 2018 07:19 PM

Mission Bhagiratha trail run success in mancheryal district

మంచిర్యాల: జిల్లాలోని హాజీపూర్ మండలం ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద మిషన్ భగీరథ ట్రయల్ రన్ విజయవంతమైంది. ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఇంటెక్ వెల్ నుంచి రిగేటర్‌కు నీటిని సరఫరా చేసే మోటారును స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మానస పుత్రిక అయిన మిషన్ భగీరథ కార్యక్రమం ఎంతో గొప్పదన్నారు.

ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద నిర్మించిన ఇంటెక్‌వెల్ నుంచి నీటిని మంచిర్యాల, చెన్నూర్ నియోజక వర్గాలకు అందించనున్నామని తెలిపారు. ప్రజలందరికి స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో ప్రియాంక, మిషన్ భగీరథ డీఈ కృష్ణ, ఎస్‌ఈ ప్రకాశ్‌రావు, ఈఈలు శ్రీనివాస్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ మేక రమేశ్ బాబు, ఏఈ నూక రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

2413
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles