సచ్చాడనుకున్నారు.. సజీవంగా ఇంటికి చేరాడు..!

Mon,January 21, 2019 07:27 AM

missing man returns after 15 years

యాదగిరిగుట్ట రూరల్: 15 ఏండ్ల క్రితం తప్పిపోయిన మతిస్థిమితంలేని ఓ వ్యక్తి.. ఒక దశలో చనిపోయాడని భావించి ఆశలు వదులుకున్న తరుణంలో ఇంటికి తిరిగి రావడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా తూర్పుపాలేనికి చెందిన కుంచె సత్యనారాయణ పెద్ద కొడుకు రాఘవయ్య 15 ఏండ్ల క్రితం మతిస్థిమితం కోల్పోయి ఇంటినుంచి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబీకులు అతడి కోసం ఎంతో వెదికి.. ఆచూకీ దొరక్కపోవడంతో ఆశలు వదులుకున్నారు. చనిపోయాడని భావించి వర్ధంతి నిర్వహిస్తున్నారు.

రాఘవయ్య యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పరిసరాల్లో తిరుగుతుండగా స్థానికులు గమనించి 19 జూన్ 2016లో అమ్మఒడి ఆశ్రమంలో చేర్పించారు. ఆశ్రమ నిర్వాహకులు అతడికి చికిత్స అందిస్తూ ఆచూకీని తెలుసుకునేందుకు ప్రయత్నించారు. గత డిసెంబర్ నుంచి రాఘవయ్య మానసికస్థితి నుంచి కుదుటపడి ఇంటి చిరునామా చెప్పడంతో ఆశ్రమ సిబ్బంది సదరు కుటుంబ సభ్యులకు సమాచారమందించారు. దీంతో రాఘవయ్య సోదరుడు ప్రసాద్ ఆదివారం ఇక్కడికి రాగా గుట్ట పోలీస్‌స్టేషన్‌లో సీఐ నరసింహరావు సమక్షంలో రాఘవయ్యను అతని సోదరుడికి అప్పగించారు.

4122
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles