అదృశ్యం కేసులు షీటీమ్స్‌కు..

Sun,May 5, 2019 04:42 AM

missing cases investigation she teams

హైదరాబాద్ : బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామం ముగ్గురు మైనర్ బాలిక హత్యల సంఘటనల తర్వాత రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ అవగాహనతో పాటు మిస్సింగ్ కేసుల పర్యవేక్షణపై ప్రత్యేక శ్రద్ధను తీసుకుంటున్నారు. అవగాహనలో పిల్లలపై తల్లిందండ్రుల నిఘా, మిస్సింగ్ కేసులలలో షీటీమ్స్‌ను రంగంలోకి దించనున్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మొత్తం 8 షీటీమ్స్ బృందాలు మిస్సింగ్ కేసులకు సంబంధించిన వ్యవహారాల్లో దర్యాప్తు అధికారికి సహకరించేందుకు సిద్ధంగా ఉంటారు. మరికొన్ని సందర్భాల్లో మిస్సింగ్‌లపై ఫిర్యాదు చేయడానికి వెనుకాడే కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు వారికి అవసరమైన సహకారాలను షీటీమ్స్ అందించనున్నది. షీటీమ్స్ బృందాలు బాధితులతో నేరుగా వెళ్లి మాట్లాడి అదృశ్యానికి సంబంధించిన విషషయాలు పరిశీలించాలని సీపీ సూచించారు. బాలికలు, బాల లు, యువతులు, మహిళల మిస్సింగ్ కేసులపై షీటీ మ్స్ బృందాలు ప్రత్యేక దృష్టిని పెట్టాయి. పెండింగ్ లో ఉన్న వాటినా దర్యాప్తు అధికారులకు సహకరి స్తూ వాటి తాజా పరిస్థితులను ఆరా తీయనున్నారు.

మై ఆటో ఈజ్ సేఫ్ ఉంటేనే ఎక్కాలి..


రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలు, మహిళలు మై ఆటో ఈజ్ సేఫ్ స్టిక్కర్ ఉన్న ఆటోను మాత్రమే ఎక్కాలి. అలా స్టిక్కర్‌లేని ఆటోలు కనపడితే వాటి సమాచారం పోలీసులకు అందిస్తే ట్రాఫిక్ పోలీసు సహాయంతో ఆ ఆటోలకు స్టిక్కర్ ఉండేలా చర్యలు తీసుకుంటారు. ఆ స్టిక్కర్ ఉన్న ఆటో ఎక్కినప్పుడు వెంటనే దానిపై ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసుకోవాలి. ఆ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు పంపిస్తే మీ ప్రయాణం సురక్షితంగా మారుతుందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

735
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles