15 ఏండ్ల తర్వాత తల్లి ఒడికి...

Thu,March 21, 2019 08:08 AM

missing boy reached home after 15 years

హైదరాబాద్ : మూడో తరగతి చదువుతున్న సమయంలో ఇంట్లో నుంచి పారిపోయిన ఓ బాలుడు అబిడ్స్ పోలీసుల చొరవతో 15 సంవత్సరాల అనంతరం తల్లి ఒడికి చేరాడు. ఇన్‌స్పెక్టర్ రవికుమార్ కథనం ప్రకారం... వనపర్తి టౌన్‌లో నివసించే మన్యం, అంజమ్మల కుమారుడు రాజేశ్ అలియాస్ సురేష్ 15 సంవత్స రాల క్రితం పారిపోయి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. అప్పటి నుంచి ఫుట్‌పాత్‌పై ఉంటున్నాడు. ఇటీవల అబిడ్స్ పోలీసులు ఫుట్‌పాత్‌లపై ఉంటున్న వారిని గుర్తించి ఫింగర్‌ ప్రింట్స్‌ను సేకరించారు. కాగా.. రాజేశ్ చిరునామా అడగగా వనపర్తి నుంచి పారిపోయి వచ్చినట్లు తెలపగా అబిడ్స్ పోలీసులు వనపర్తి టౌన్ స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. అతని ఫింగర్ ప్రింట్స్ సహాయంతో రాజేశ్ మన్యం,అంజమ్మల కుమారుడిగా గుర్తించారు. కాగా.. అబిడ్స్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్, ఎస్‌ఐ లక్ష్మయ్య రాజేశ్‌ను అతని తల్లి అంజమ్మకు అప్పగించారు.

2124
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles