మిరేజ్ దాడి వంద‌ శాతం సక్సెస్‌.. జైషే కంట్రోల్ రూమ్‌లు ధ్వంసం

Tue,February 26, 2019 09:43 AM

Mirage attack 100 per cent successful, JeM control rooms destroyed

హైద‌రాబాద్: జ‌మ్మూక‌శ్మీర్‌లోని స‌రిహ‌ద్దు వెంట మిరేజ్ యుద్ధ విమానాల‌తో చేసిన దాడి నూటికి నూరు శాతం స‌క్సెస్ అయిన‌ట్లు అధికారులు చెబుతున్నారు. ప‌క్కా ప్లాన్ ప్ర‌కార‌మే దాడి జ‌రిగింద‌ని అంటున్నారు. అర్థ‌రాత్రి పూట ఉగ్ర‌స్థావ‌రాల‌పై భార‌త వైమానిక ద‌ళం దాడి చేసింది. ఈ దాడి త‌ర్వాత భార‌త హై అల‌ర్ట్‌లో ఉంది. స్ట్ర‌యిక్స్ సక్సెస్ అయ్యాయ‌ని, ఇక‌ హై అల‌ర్ట్‌లో ఉండ‌డం మ‌న బాధ్య‌త అని మేజ‌ర్ జ‌న‌ర‌ల్ ఏకే సివాచ్ తెలిపారు. ఒక‌వేళ మిరేజ్ దాడి నిజ‌మే అయితే, పాకిస్థాన్ భూభాగంలోకి 1971 యుద్ధం త‌ర్వాత భార‌త ఫైట‌ర్ జెట్లు వెళ్ల‌డం ఇదే మొద‌టిసారి అవుతుంది. ఇటీవ‌ల పుల్వామాలో జ‌రిగిన సూసైడ్ దాడికి తామే కార‌ణ‌మ‌ని జైషే సంస్థ ప్ర‌క‌టించ‌డంతో.. ఆ ఉగ్ర సంస్థ స్థావ‌రాల‌పై భార‌త వైమానిక ద‌ళం మిరేజ్‌ల‌తో దాడి చేసింది. ఎల్వోసీ వెంట ఉన్న బాల్కోట్‌, చాకోటి, ముజ‌ఫ‌రాబాద్ ద‌గ్గ‌ర ఉన్న ఉగ్ర శిబిరాల‌పై దాడి జ‌రిగింది. జైషే మ‌హ్మ‌ద్ కంట్రోల్ రూమ్‌ల‌న్నీ ధ్వంసం అయిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు.

4012
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles