న‌ల్లగొండ, సూర్యాపేట మెడిక‌ల్ కాలేజీలపై మంత్రుల సమీక్ష

Tue,July 24, 2018 08:17 PM

Ministers reviews on Nalgonda and suryapet medical college

హైద‌రాబాద్: నల్లగొండ, సూర్యాపేట మెడిక‌ల్ కాలేజీల ప‌నుల‌ను మ‌రింత వేగ‌వంతం చేయాల‌ని స‌ంబంధిత ఉన్న‌తాధికారుల‌ను వైద్యారోగ్యశాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి, విద్యుత్‌, ఎస్సీ సంక్షేమ‌శాఖ మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి ఆదేశించారు. ఈ రెండు కాలేజీల పనులపై మంత్రులు నేడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా స్థ‌ల సేక‌ర‌ణ పూర్త‌యితే సీఎం చేతుల మీదుగా రెండు మెడిక‌ల్ కాలేజీల‌కు శంకుస్థాప‌న చేయించనున్నట్లు తెలిపారు. అలాగే ఎంసిఐ ద్వారా జ‌ర‌గాల్సిన ప‌నుల ప్ర‌క్రియ‌ల‌ను స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా పూర్తి చేయాల‌ని సూచించారు. నిర్ణీత గ‌డువులోగా ఆయా ప‌నులు పూర్తి చేయాల‌ని, సీఎం కేసీఆర్ సంక‌ల్పానికి త‌గిన‌ట్లుగా కాలేజీలు ప్రారంభం కావాల‌ని చెప్పారు. అందుకు అవ‌స‌ర‌మైన అన్ని ర‌కాల స‌హ‌కారం తాము అందిస్తామ‌న్నారు. భేటీలో వైద్య ఆరోగ్య‌శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ శాంతికుమారి, కుటుంబ సంక్షేమ‌శాఖ క‌మిష‌న‌ర్ వాకాటి క‌రుణ‌, ఆరోగ్యశ్రీ సిఇఓ మాణిక్క రాజ్‌, వైద్య విద్య సంచాల‌కుడు డాక్ట‌ర్ ర‌మేశ్‌రెడ్డి, వైద్య సంచాల‌కుడు డాక్ట‌ర్ గ‌డ‌ల శ్రీ‌నివాస‌రావు, టీఆఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ వేణుగోపాల్ రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

2103
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles