సిరిసిల్లలో అగ్రికల్చర్ కాలేజీకి కేటీఆర్ శంకుస్థాపన

Wed,June 13, 2018 01:19 PM

Ministers KTR laid foundation stone for Agriculture College in Rajanna Sircilla dist

రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని సర్దాపూర్‌లో అగ్రికల్చర్ కళాశాలకు మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కేటీఆర్ కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేశ్‌తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. వ్యవసాయ కళాశాలకు శంకుస్థాపన చేసిన అనంతరం కేటీఆర్ మాట్లాడారు.

రాష్ట్రంలో ప్రతి వ్యక్తి అభివృద్ధి చెందేలా ప్రభుత్వం కార్యక్రమాలను రూపొందిస్తుందని తెలిపారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణం కావాలన్నదే సీఎం కేసీఆర్ కల అని మంత్రి ఉద్ఘాటించారు. జవహర్‌లాల్ ప్రధానిగా ఉన్నప్పుడు ఎస్పారెస్పీకి శంకుస్థాపన చేశారు. ఇప్పటికీ ఎస్సారెస్పీ రెండో దశ పనులు పూర్తి కాలేదని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు కాలంతో పరుగులు పెడుతున్నాయని చెప్పారు. వచ్చే ఆరు నెలల్లో సిరిసిల్ల జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు.

రైతుజీవిత బీమా, రైతుబంధు పథకం రైతులకు ఒక ధీమాలాగా పని చేస్తున్నాయన్నారు. 58 లక్షల మంది రైతులకు రూ. 12 వేల కోట్లు రైతుబంధు పథకం కింద అందించామని తెలిపారు. ఐదు వేల ఎకరాలకు ఒక ఏఈవోను నియమించామని వెల్లడించారు. అధికారులందరూ రైతులందరికీ రైతుబీమా పథకంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రైతుబీమా పథకాన్ని ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

2463
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS