పసుపు బోర్డు కోసం 'ఎంపీ కవిత' ప్రైవేట్‌ బిల్లు పెట్టారు..!

Tue,March 26, 2019 06:24 PM

Minister Vemula Prashanth Reddy Speech

నిజామాబాద్‌: ఆర్మూరులో బీజేపీ నేత రామ్‌ మాధవ్‌ పచ్చి అబద్ధాలు మాట్లాడారని మంత్రి ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఇప్పటికిప్పుడు రైతులకు న్యాయం చేయొచ్చు. కానీ బీజేపీ ప్రభుత్వం రైతుల చెవిలో పూలు పెడుతున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే పసుపు బోర్డు తెస్తామంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పసుపు బోర్డు ఎందుకు ఏర్పాటు చేయలేదు. ఎంపీ కవిత పసుపు బోర్డు అంశంపై కేంద్రానికి ఎన్నో సార్లు విజ్ఞప్తి చేశారు. 6 రాష్ర్టాల సీఎంలతో పసుపు రైతులకు మద్దతుగా లేఖ రాయించారు. 2017 ఏప్రిల్‌ 27న పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీని కూడా కలిసి పసుపు బోర్డు అంశంపై చర్చించాం. ఎంపీ కవిత పసుపు బోర్డు ఏర్పాటు కోసం ప్రైవేట్‌ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. మద్దతు ధర కోసం పోరాడారు. ఐదేళ్లు పూర్తైన తర్వాత ఇప్పుడు పసుపు బోర్డు మేనిఫెస్టోలో పెడతామనడం సిగ్గు చేటు. అని ప్రశాంత్‌ రెడ్డి విమర్శించారు.

1639
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles