కోనసీమ కంటే పాలేరు నియోజకవర్గమే మిన్న

Sat,November 24, 2018 10:47 PM

కరువు ప్రాంతాల్లో పచ్చని పైర్లు చూస్తుంటే గుండే నిండుతుంది
పాలేరు టీఆర్‌ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం: కోనసీమ కంటే పాలేరు నియోజకవర్గమే మిన్నగా మారిందని పాలేరు నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. తిరుమలాయపాలెం మండలంలోని రఘునాధపాలెం, హస్నాబాద్, లక్ష్మిదేవిపల్లి, బడితండ, జెండాలతండ, బచ్చోడు తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో మంత్రి మాట్లాడారు.

కరువు ప్రాంతమైన తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మం రూరల్ మండలాల్లోని గ్రామాల్లో పచ్చని పైర్లను చూస్తుంటే గుండె నిండిపోతుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో చేపట్టిన శ్రీభక్తరామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ప్రాంతాల్లో బీడు భూములు సైతం సస్యశ్యామలంగా మారాయని, ప్రజలు సఖసంతోషాలతో ఉండాలంటే సాగు నీరు ప్రధానమని గుర్తించి ఉప ఎన్నికల్లో మీరు అందించిన విజయంతో ఈ నేలపై సిరులు పండించేందుకు సాగునీరు అందించానన్నారు.


పాలేరు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని.. మళ్లీ ఆదరించి కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈసందర్భంగా రఘునాధపాలెం, బచ్చోడు, హస్నాబాద్, గిరిజనతండాలు, గ్రామాల్లో మహిళలు, ప్రజలు తుమ్మలకు ఘనస్వాగతం పలికారు. తిలకం దిద్ది డప్పువాయిద్యాలతో గ్రామాల్లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు ఆర్.నరేష్‌రెడ్డి, ఎంపీపీ కొప్పుల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

1930
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles