బీజేపీ మతంను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తుంది...

Mon,April 22, 2019 04:47 PM

minister talasani srinivas yadav fire on bjp and congress

హైదరాబాద్ : దేశం గర్వపడే విధంగా రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఇటీవల ఉగ్రవాదులను రాష్ట్ర పోలీస్ సహాకారంతో ఎన్‌ఐఏ పట్టుకుందని తెలిపారు. ఉగ్రవాదం పెరగడానికి బీజేపీ విధానాలే కారణమని మండిపడ్డారు. బీజేపీ మతం అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. భద్రత, ఉగ్రవాదం వంటి అంశాలపై ప్రధాని బాధ్యతతో మాట్లాడాలి. ప్రతి అంశాన్ని మతంతో ముడిపెట్టి మాట్లాడటం తగదు. కాంగ్రెస్‌పార్టీ పిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. పిరాయింపులపై కాంగ్రెస్ నేతలకు మాట్లాడే నైతిక హక్కు లేదు. దమ్ముంటే కాంగ్రెస్ నేతలు ప్రజాక్షేత్రంలో కొట్లాడండి. ఈవీఎంలతో ఉత్తమ్ గెలవలేదా? 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కనీసం మాకు పోటీ ఇచ్చారా. కాంగ్రెస్ నేతలు ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకుంటే చాలు. మా పాలన బాగుంటేనే మాకు ప్రజలు పట్టం కట్టారు. ఇంటర్ ఫలితాలపై ప్రభుత్వం కమిటీ వేసింది. కమిటీ నివేదిక వచ్చాక ప్రభుత్వం సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

1144
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles