కేసీఆర్ సీఎం అయ్యాక యాదవులకు స్వతంత్రం..

Thu,November 8, 2018 04:27 PM

Minister Talasani says about yadavs in siddipet sabha

సిద్దిపేట : సిద్దిపేటలో వేరేపార్టీలకు చెందిన వారు నామినేషన్ వేయాలంటే భయపడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన యాదవుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాదవులు భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని మాట్లాడుతూ..రాష్ట్రంలో ఎక్కడ ప్రాజెక్ట్లు పనులు జరుగుతున్నా..అక్కడ నిద్రపోయి పనులు చేయించిన నాయకుడు హరీష్ రావు అన్నారు.

స్వతంత్రం వచ్చి 72 ఏళ్ళు అయినా యాదవులకు స్వతంత్రం రాలేదు కానీ కేసీఆర్ సీఎం అయిన తరువాత యాదవులకు స్వతంత్రం వచ్చిందన్నారు. యాదవులకు 70 లక్షల గొర్రెలు అందించి సీఎం కేసీఆర్ వారిని ఆదుకున్నారు. రాష్ట్రంలో దొంగల కూటమి ఏర్పడింది. గడ్డం పెంచుకుంటే ఒక్కడు ముఖ్యమంత్రి అయితరంట. అలీబాబా 40 దొంగలుగా కూటమి ఏర్పడిందని తలసాని ఎద్దేశా చేశారు. దేశంలో ప్రధాని ఆలోచన చెయ్యని విధంగా సీఎం కేసీఆర్ రైతు బంధు పథకం తేవడం జరిగిందన్నారు. 101 స్థానాలు టిఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హరీష్ రావు గెలుపు ఎప్పుడో ఖాయమైంది.. కానీ హరీష్ రావును లక్ష 11వేల మెజార్టీతో సిద్దిపేట ప్రజలు గెల్పించాలని ప్రజలను తలసాని కోరారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మండలి చీప్ వీప్ పాతూరి సుధాకర్ రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు.

1160
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles