ప్రజల సౌకర్యార్థం బాలానగర్ ఫ్లైఓవ‌ర్‌: తలసాని

Mon,August 21, 2017 05:35 PM

Minister talasani says about balanagar flyover


హైదరాబాద్ : బాలానగర్ ప్రాంత ప్రజలు ట్రాఫిక్‌తో నరకయాతన చూస్తున్నరని, ప్రజల సౌకర్యార్థం ఫ్లైఓవ‌ర్‌ నిర్మాణం చేపడుతున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. బాలానగర్ ఫ్లైఓవ‌ర్‌ నిర్మాణానికి ఇవాళ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో మంత్రి తలసాని మాట్లాడుతూ దేశం, రాష్ర్టాభివృద్ధికి కరెంట్ నీళ్లు, శాంతి భద్రతలు ప్రధానమైనవన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. బడుగు, బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చినమన్నారు. రాబోయే కాలంలో హైదరాబాద్ గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రెప్పపాటు కోత లేకుండా కరెంట్ ఇస్తున్నమన్నారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నరన్నారు. హైదరాబాద్ వాసుల తాగునీటి అవసరాల కోసం రెండు రిజర్వాయర్ల నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు.

1373
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles