‘మా’ ప్రతినిధులతో మంత్రి తలసాని భేటీ

Sat,April 21, 2018 04:49 PM

Minister Talasani met with MAA representatives at Secretariat

హైదరాబాద్ : రాష్ట్ర సచివాలయంలో సినీ పరిశ్రమ ప్రముఖులు, ‘మా’ ప్రతినిధులతో సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పోలీసులు, ఇతర శాఖల ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. సమావేశంలో సినీ రంగంలో వివాదాలు, లైంగిక వేధింపుల ఆరోపణలపై చర్చిస్తున్నారు.

గత కొద్ది రోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై సినీపెద్దలు అన్ని రంగాల వారితో శనివారం ఉదయం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి చర్చించిన సంగతి తెలిసిందే. అన్న‌పూర్ణ స్డూడియో సెవెన్ ఎక‌ర్స్‌లో జ‌రిగిన ఈ స‌మావేంలో ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, నిర్మాతల మండలి, నటీనటుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రెండు గంట‌ల పాటు జ‌రిగిన విస్తృతస్థాయి భేటీలో కాస్టింగ్ కౌచ్‌, టాలీవుడ్ స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించిన‌ట్టు తెలుస్తుంది. స‌మావేశం త‌ర్వాత సినీ ప్ర‌ముఖులు ఎవ‌రు మీడియాతో మాట్లాడ‌కుండా వెళ్ళిపోయారు.

2282
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles