తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి శ్రీనివాస గౌడ్

Thu,February 21, 2019 10:50 AM

minister srinivas goud visit tirumala tirupathi devasthanam

తిరుమల శ్రీవారిని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం తోమాల సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగాయకుల మండపంలో శ్రీనివాస్ గౌడ్ కు వేదపండితులు వేదశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందచేసి పట్టువస్త్రంతో సత్కరించారు.

కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ఏంతో అభివృద్ధి చెందిందని శ్రీవినస్ గౌడ్ తెలిపారు. తెలంగాణలో ప్రవేశ పెట్టిన ప్రజా సంక్షేమ పధకాలవైపు పొరుగు రాష్ట్రాలు చూస్తున్నాయని, వాటిని తమ రాష్ట్రంలో కూడా అమలు చేసే విధంగా ప్రయత్నాలు చూస్తున్నారని అన్నారు. ఇరు రాష్ట్రాలు కలసి మెలసి అభివృద్ధి పధంలో నడిచే విధంగా చేయాలని స్వామి వారిని ప్రార్ధించినని, వచ్చే ఎన్నికలలో దేశంలోనే ఆదర్శ నాయకుడిగా ఎదిగి, కేసీఆర్ ప్రధాని కావాలని స్వామి వారిని వేడుకున్నానని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు

1758
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles