కేంద్ర రాజకీయాల్లో 'కీ'రోల్ టీఆర్‌ఎస్‌దే..

Sun,March 24, 2019 09:39 PM

minister srinivas goud election campaign in mahabubnagar

నారాయణపేట: కేంద్ర రాజకీయాలలో టీఆర్‌ఎస్ పార్టీ కీరోల్ పోషించడం ఖాయమని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. పాలమూరు ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే డా.ల‌క్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన మేధస్సుతో దేశంలో ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలుచేసి పుట్టిన బిడ్డ నుంచి వృద్ధుల వరకు అండగా నిలుస్తున్నారన్నారు. పుట్టే బిడ్డలకు కేసీఆర్ కిట్లు, వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, కార్మికులకు పింఛన్లు, రైతులకు రైతుబంధు, రైతు బీమా పథకాలను అమలు చేసి అండగా నిలుస్తున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారన్నారు. ఇటువంటి పాలన దేశవ్యాప్తం కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటై కేంద్ర రాజకీయాలను శాసించడం ఖాయమన్నారు. అన్నివిధాలా కలిసొచ్చి మన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయితే మన రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలై అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం లభిస్తుందని శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ తరపున పోటీలో ఉన్న ఎంపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

మాజీ మంత్రి జడ్చర్ల ఎమ్మెల్యే ల‌క్ష్మారెడ్డి మాట్లాడుతూ.. రానున్న లోక్‌సభ ఎన్నికలలో మన పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తే కేంద్రంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు కావచ్చన్నారు. ప్రతి ఒక్కరూ టీఆర్‌ఎస్ అభ్యర్థులను రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి, రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్ ముదిరాజ్ మాట్లాడుతూ.. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో వ్యవహరించి టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. నాపై నమ్మకం ఉంచి ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టికెట్ ను కేటాయించారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేసేందుకు, పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకు అన్నివిధాలా సహకరిస్తానన్నారు.

1064
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles