మంత్రి నిరంజన్‌రెడ్డికి మాతృవియోగం

Mon,July 22, 2019 07:56 AM

minister singireddy niranjan reddys mother passes away

వనపర్తి: వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి మాతృవియోగం కలిగింది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి సింగిరెడ్డి తారకమ్మ(105) సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న కుటుంబ‌స‌భ్యులు వ‌న‌ప‌ర్తిలోని ఆమె స్వగృహానికి చేరుకున్నారు. స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, పార్టీ శ్రేణులు ఆమెకు నివాళుల‌ర్పించేందుకు త‌ర‌లివ‌స్తున్నారు. తారకమ్మ అంత్యక్రియలు ఈరోజు మూడు గంటలకు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. వనపర్తి కి 13 కిలోమీటర్ల దూరంలోని పాన్‌గ‌ల్‌ మండలం కొత్తపేట శివారులోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

644
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles