టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి!

Fri,March 22, 2019 05:25 PM

Minister Singireddy Niranjan Reddy Speech In TRS   Meeting

నాగర్‌కర్నూల్‌: జాతీయ పార్టీలకు దేశ ప్రయోజనాలు పట్టలేదు. 70వేల టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నా రైతులకు సాగునీరు అందించడంలో విఫలమయ్యాయని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ స్థాయి సన్నాహక సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఆలోచనలు, జాతి ప్రయోజనాల విషయంలో టీఆర్‌ఎస్‌కు జాతీయ పార్టీలు సరితూగవు. కేంద్రానికి అత్యధిక ఆదాయం ఇచ్చే రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటి. కేంద్రంలో మనం చక్రం తిప్పే పరిస్థితి ఉంటే రాష్ర్టానికి భారీగా నిధులు వస్తాయి. 16 మంది టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థులను మెజార్టీతో గెలిపించాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీఆర్‌ఎస్‌ రాజీలేని పోరాటం చేస్తోంది. ప్రాజెక్టులు పూర్తి కావాలంటే కేంద్రం నుంచి నిధులు రాబట్టాలి. తుమ్మిళ్ల, గట్టు ఎత్తిపోతల పథకాలతో నడిగడ్డ సస్యశ్యామలం కానుంది. నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ పరిధిలో ప్రతి ఎకరానికి సాగునీరు అందుతుంది. నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థి రాములును భారీ మెజార్టీతో గెలిపించుకుందామని నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

1079
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles