బాలికల హాస్టల్ లో మంత్రి సత్యవతి ఆకస్మిక తనిఖీ

Mon,December 2, 2019 08:15 PM


మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల బాలికల హాస్టల్ ను రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ లో ఉన్న బాలికలతో మాట్లాడి..సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ లో తాగునీటి వసతి మెరుగు పర్చాలని, కోతుల బెడద తొలగించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. నేడు హాస్టల్ లో ఇద్దరు బాలికల పుట్టిన రోజు కావడంతో వారికి నగదు పారితోషికం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.


హాస్టల్ వార్డెన్ పిల్లలతోపాటు అక్కడే అందుబాటులో ఉండడం, బాలికలు వార్డెన్ గురించి మంచిగా చెప్పడంతో ఆమెను మంత్రి సత్యవతి అభినందించారు. మంత్రి సత్యవతి రాథోడ్ తో పాటు జడ్పీ చైర్ పర్సన్ ఆంగోతు బిందు, జడ్పీటీసీలు బండి వెంకట్ రెడ్డి, ఝాన్సీ ఉన్నారు. మంత్రి హాస్టల్ చేరుకున్న తర్వాత జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ప్రియాంక, జిల్లా సంక్షేమ అధికారి సంధ్యారాణి, అదనపు ఎస్పీ ప్రభాకర్ వచ్చారు.

838
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles