మండలి చైర్మన్‌గా సభకు వన్నె తెస్తారు : మంత్రి సత్యవతి

Wed,September 11, 2019 03:07 PM

Minister Satyavati praises on Gutha Sukhender reddy

హైదరాబాద్‌ : శాసనమండలి చైర్మన్‌గా ఈ సభకు గుత్తా సుఖేందర్‌ రెడ్డి వన్నె తెస్తారని గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. మండలి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన గుత్తా సుఖేందర్‌ రెడ్డికి మంత్రి సత్యవతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మండలిలో ఆమె ప్రసంగించారు. సీఎం కేసీఆర్‌ ఆశీర్వాదంతో తొలి గిరిజన మహిళగా తాను మంత్రి కావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. కడియం శ్రీహరి చెప్పినట్లు తెలంగాణ పట్ల చంద్రబాబు నాయుడు వైఖరి నచ్చక నాడు మీరు పార్టీ మారినప్పుడు.. నల్లగొండ పార్లమెంట్‌ పరిధిలోని నాయకులంతా మీ వెంట రావడం ఆరోజు పార్టీ నియోజకవర్గం ఇంచార్జిగా తాను చూశానని ఆమె గుర్తు చేసుకున్నారు. నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో పార్టీ ఇంచార్జిగా రెండేళ్లు మీతో కలిసి పని చేసే అవకాశం తనకు వచ్చిందన్నారు. ఆదర్శవంతంగా సభను నిర్వహిస్తారని, భవిష్యత్‌లో మరెన్నో ఉన్నత పదవులు అలంకరించి ప్రజలకు, రైతాంగానికి మరెన్నో సేవలు చేయాలని కోరుకుంటున్నానని మంత్రి సత్యవతి పేర్కొన్నారు.

1011
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles