టీఆర్‌ఎస్ పార్టీ రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుంది...

Fri,September 7, 2018 06:14 PM

minister pocharam srinivas reddy lay development works in kamareddy

కామారెడ్డి: వర్నీ మండలం చందూర్ గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పొచారం శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా జరిగిన గ్రామ సభలో మంత్రి గారు మాట్లాడుతూ రైతుల సమస్యలపై లోతైన అవగాహన కలిగిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. దేశంలో వ్యవసాయ రంగానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు, రైతుబంధు పథకం ద్వారా ఏడాదికి ఎకరానికి రూ. 8000 ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. గతంలో కరంటు గోస ఉండేది, కాని టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఆ కష్టాలు తీరాయి.

రైతుబంధు పథకం ద్వారా వానాకాలం పంటకు మే 15 నాటికి, యాసంగిలో నవంబర్ 15 నాటికి ప్రతి సీజన్ లో ఎకరాకు రూ. 4000 చొప్పున బ్యాంకు ఖాతాలో జమ చేస్తాం. వచ్చే ఏడాది నుంచి రైతులకు సాగనీటి కష్టాలు ఉండవు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతాయి.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలలతో నిజాంసాగర్ ప్రాజెక్టును నింపి ఏటా రెండు పంటలకు పుష్కలంగా సాగునీరు అందిస్తాం. పండిన పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నాం. పేద రైతు కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్యేశంతో రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు జీవిత బీమాను ప్రారంభించాం.

నిన్నటి వరకు మొత్తం 813 మంది రైతుబీమా అర్హత కలిగిన రైతులు చనిపోగా, 721 మంది వివరాలను ఎల్ఐసీ సంస్థకు పంపగా 562 మందికి రూ..5 లక్షల బీమా పరిహారం ఆయా రైతుల నామినీ ఖాతాలలోకి పంపిణీ జరిగింది.

పేదవారి ఆత్మగౌరవం కాపాడే విదంగా డబుల్ బెడ్ రూం ఇళ్ళను నిర్మిస్తున్నాం. త్రాగునీటి కష్టాలను దూరం చేయడానికే మిషన్ భగీరధ. ఫ్లోరైడ్ నుండి విముక్తి కలిగించి సురక్షితమైన నీటిని ఇంటింటికి త్రాగునీరు అందిస్తున్నాం. ఇప్పటికే పనులు పూర్తయి అన్ని గ్రామాలకు బల్క్ వాటర్ చేరుకున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజ సంక్షేమమే ద్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.

ఈ సందర్భంగా, తమ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని గ్రామస్థులు మంత్రి గారికి విజ్ఞప్తి చేయగా, గతంలో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మోస్రా, చందూర్ లను నూతన మండలాలుగా మారుస్తానన్నారు.చందూర్ గ్రామంలో రూ. 2.10 కోట్లతో వాగుపై నిర్మించిన బ్రిడ్జిని, రూ.18 లక్షలతో నిర్మించిన ప్రాధమిక సహకార సంఘం నూతన భవనాన్ని, నూతన గ్రామ గ్రంధాలయాన్ని, సిసీ రోడ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమాలలో జహీరాబాద్ ఎంపీ బిబీ పాటిల్, నిజామాబాద్ డీసీసీబీ అధ్యక్షుడు గంగాదర్ పట్వారి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

1554
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles