పోచారం వేసిన మిరపకాయ బజ్జీలు... భళే టేస్టు

Sat,November 17, 2018 10:02 PM

minister pocharam cooked mirchi bajji while campaigning in banswada

బాన్సువాడ: ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని పులికుచ్చతండాకు వెళ్లిన మంత్రి పోచరాం శ్రీనివాసరెడ్డి తండాలో ఒక హోటల్‌కు వెళ్లి స్వయంగా మిరపకాయ బజ్జీలను వేశారు. కడాయిలో ఉన్న వేడివేడి నూనెలోంచి జాలిగంటేతో బజ్జీలు తీయడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది. మంత్రి వేసిన బజ్జీలు భలే టేస్టుగా ఉన్నాయంటూ తండావాసులు, టీఆర్‌ఎస్ నాయకులు ఆరగించారు. హోటల్‌లోకి మంత్రి రావడంతో యజమాని సంతోషం వ్యక్తం చేశారు.

731
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles