'భౌతిక దాడులకు పాల్పడటం దురదృష్టకరం'

Tue,March 13, 2018 08:06 PM

Minister Pocharam condemns physical attacks on swamy goud

హైదరాబాద్: కాంగ్రెస్ సభ్యులు భౌతిక దాడులకు పాల్పడటం దురదృష్టకరమని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ సభ్యుల దాడిలో గాయపడి సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్పీకర్ స్వామిగౌడ్‌ను మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నేతి విద్యాసాగర్ నేడు పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ సభ్యులు మండలి హుందాతనాన్ని అగౌరవపరిచారన్నారు. నిరసన తెలిపేందుకు సభ్యులకు అనేక మార్గాలున్నాయి. ఇలా భౌతిక దాడులకు పాల్పడటం హేయమైన చర్యన్నారు. స్వామిగౌడ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

1952
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles