
జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలోని కొంపల్లి గ్రామంలో ఇవాళ రైతుబంధు చెక్కులు, పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ హెలికాప్టర్లో కొంపల్లికి చేరుకున్నారు. వీరికి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వాళ్లంతా కలిసి బైక్‌పై ర్యాలీగా సభాస్థలికి బయలుదేరారు. స్పీకర్ బుల్లెట్‌ను డ్రైవ్ చేయగా.. వెనక ఉపముఖ్యమంత్రి కూర్చున్నారు. మరో బుల్లెట్‌ను మంత్రి పోచారం నడపగా.. వెనక ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి కూర్చున్నారు. బైక్ ర్యాలీ కార్యకర్తల కేరింతలతో ఉత్సాహంగా సాగింది.