పంటను చూసి జీవితం ధన్యమైంది..

Wed,April 24, 2019 09:51 PM

minister niranjan reddy inspects paddy buying centre in wanaparthy dist

-వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి నిరంజన్‌రెడ్డి
వనపర్తి: సమైక్యవాదుల పాలనలో ఇక్కడి భూములు బీళ్లుగా మారి వలసలకు నిలయంగా ఉండేవని, కాని దానికి భిన్నంగా నేడు సీఎం కేసీఆర్ పాలనలో వడివడిగా ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. సాగునీరందించడంతో ఇక్కడి పొలాల్లో బంగారంలాగా పండిన పంటను చూసి జీవితం ధన్యమవుతుందన్నారు. రేవల్లి మండలంలోని చీర్కపల్లి గ్రామంలో ఒక వివాహ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా చెన్నారం గ్రామం వద్ద ఆగి వరి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. పట్టుదలతో తెచ్చుకున్న తెలంగాణను ఇష్టపడి అభివృద్ధి చేసుకుంటున్నామని, ఈ పట్టుదలకు వచ్చిన ఫలితాలే ఈ కల్లాలలోని ధాన్యపు రాశులు అని అన్నారు. తెలంగాణలోనే అతిపెద్ద ప్రాజెక్టు అయిన కాళేశ్వరం పనులు పూర్తి అయి ట్రయల్ రన్ కూడా పూర్తి చేసుకున్నదన్నారు. అలాగే జిల్లాలోని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు కూడా పూర్తి అయితే జిల్లా స్వరూపమే మారనుందన్నారు.

1834
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles