అధికారులు అప్రమత్తంగా ఉండండి:మంత్రి నిరంజన్‌రెడ్డి

Fri,April 19, 2019 07:25 PM

minister niranjan reddy alerts official after heavy rains in ts

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు, పంటల నష్టంపై వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా మార్కెటింగ్‌, పౌరసరఫరాల శాఖలకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అకాల వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే గోదాములకు తరలించాలన్నారు. మార్కెట్‌ యార్డులకు వచ్చిన ధాన్యం తడవకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. రాత్రివేళ మార్కెట్‌ యార్డుల్లో బ్యాటరీ లైట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విరివిగా టార్పాలిన్లు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.

2162
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles