జవహర్‌నగర్ అభివృద్ధి పనులకు మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన

Sun,October 20, 2019 04:07 PM

హైదరాబాద్: తన గుండె వంటి జవహర్‌నగర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అందంగా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను అత్యంత సుందరంగా అభివృద్ధి చేస్తానని మంత్రి స్పష్టం చేశారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా జవహర్‌నగర్‌లో రూ. 2 కోట్ల వ్యయంతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి మల్లారెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. అదేవిధంగా మల్లారెడ్డి నారాయణ హాస్పటిల్ ఆధ్వర్యంలో జవహర్‌నగర్‌లోని స్థానిక జెడ్పీహెచ్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించారు. రోగులకు మందులను అందజేశారు. పలువురి ఉచిత వైద్యసేవలకు మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, ప్రజల ఆశీస్సులతో తనకీ మంత్రి పదవి దక్కిందన్నారు. ఇంతగొప్ప అవకాశం కల్పించిన జవహర్‌నగర్ ప్రజల రుణాన్ని తీర్చుకుంటానని తెలిపారు. సోషల్ మీడియాలో తనపై కొందరు దుష్ప్రాచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులను కాజేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో జవహర్‌నగర్ అభివృద్ధికి రూ.26 కోట్ల నిధులను తీసుకువచ్చినట్లు తెలిపారు. అతి త్వరలోనే వాటి ద్వారా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి హాస్పిటల్ ఛైర్మన్ భద్రారెడ్డి, కమిషనర్ అరుణకుమారి, ఎమ్మార్వో లావణ్య, జెడ్పీఛైర్‌పర్సన్ చంద్రారెడ్డి, వైస్‌ఛైర్మన్ వెంకటేష్, టీఆర్‌ఎస్ నాయకులు రెడ్డిశెట్టి చందర్, ముర్గేష్, లావణ్య, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.

460
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles