'మిష‌న్ భ‌గీర‌థ ప‌నులు వేగ‌వంతం కావాలి'

Wed,August 2, 2017 06:45 PM

Minister Mahender reddy meeting on Vikarabad district development in Secretariat

వికారాబాద్: జిల్లా అభివృద్ధిపై స‌చివాల‌యంలో ఇవాళ మంత్రి మ‌హేంద‌ర్ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో జిల్లా క‌లెక్ట‌ర్ దివ్య‌, వివిధ శాఖల‌ అధికారులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన మంత్రి... మిష‌న్ భ‌గీర‌థ ప‌నులు మ‌రింత వేగ‌వంతం చేయాల‌న్నారు. 3 వ విడ‌త హ‌రిత‌హారం లో అధికారులు అల‌స‌త్వం వీడాల‌న్నారు. మైనార్టీ సంక్షేమం, వెనుక‌బ‌డిన వ‌ర్గాల కోసం చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం చేయాలని స్ప‌ష్టం చేశారు. రైతుల‌కు ఎరువులు, విత్త‌నాలు స‌కాలంలో అందించాల‌ని ఆదేశించారు. అన్ని మండ‌ల కేంద్రాల‌కు డ‌బుల్ రోడ్ల ప‌నులు వేగ‌వంతం చేయాల‌ని మంత్రి చెప్పారు.

1119
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles