గాజీపూర్‌లో కుర్మయాదవులకు గొర్రెల పంపిణీ

Tue,September 26, 2017 11:49 AM

Minister mahender reddy distributes sheeps in Vikarabad district

వికారాబాద్ : జిల్లాలోని పెద్దెముల్ మండలంలోని గాజీపూర్ లో కుర్మయాదవులకు రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి నేడు గొర్రెలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుగణాభివృద్ధి సంఘం చైర్మన్ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కుల వృత్తులను సీఎం కేసీఆర్ కోట్లాది నిధులతో ప్రోత్సహిస్తూ వారి ఆదాయం పెంచుతున్నారన్నారు. రాష్ట్రంలో కుర్మయాదవులకు నాలుగు వేల కోట్లతో 84 లక్షల మందికి గొర్రెలను అందిస్తున్నామన్నారు. జిల్లాలో 20,580 మంది కుర్మ యాదవులకు రూ. 25 కోట్ల నిధులతో గొర్రెలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల ముందు ఇవ్వని హామీలనూ సైతం సీఎం కేసీఆర్ పేదలకు అమలు పరుస్తున్నారన్నారు.

657
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles