‘తొర్రూర్ ఆస్పత్రిని 50 పడకలకు అప్‌గ్రేడ్ చేస్తాం’

Mon,May 15, 2017 01:40 PM

Minister Laxmareddy visits Torruru Govt Hospital

మహబూబాబాద్ : తొర్రూర్ ప్రభుత్వ ఆస్పత్రిని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సందర్శించారు. ప్రసూతి విభాగం, ఆపరేషన్ థియేటర్, జనరల్ వార్డులు, హాజరు రిజిస్టర్‌ను మంత్రి పరిశీలించారు. రోగులను పరామర్శించిన మంత్రి.. ఆస్పత్రి అభివృద్ధిపై వైద్యులు, అధికారులతో చర్చించారు. ఆస్పత్రికి అవసరమైన వైద్య పరికరాలను తక్షణమే అందజేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఆస్పత్రిలో ప్రసూతులు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. మరిన్ని సదుపాయాలు కల్పించి రోగులకు మంచి వైద్యం అందేవిధంగా చూస్తామన్నారు. త్వరలో తొర్రూర్ ఆస్పత్రిని 50 పడకలకు అప్‌గ్రేడ్ చేస్తామని ప్రకటించారు. త్వరలోనే మార్చురీ గదిని నిర్మిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వాసుపత్రులను ఆధునీకరిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెలాఖరు నుంచి అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. కేసీఆర్ కిట్స్ కూడా నెలాఖరు నుంచే ఇస్తామన్నారు మంత్రి.

841
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles