అమ్మఒడి కార్యక్రమంపై మంత్రి లక్ష్మారెడ్డి సమీక్ష

Mon,April 17, 2017 03:09 PM

Minister Laxmareddy review on AMMAVODI Scheme

హైదరాబాద్ : సచివాలయంలో అమ్మఒడి కార్యక్రమంపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి కుటుంబ సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అమ్మఒడిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కరుణ ఇచ్చారు. అమ్మఒడి పథకం పకడ్బందీగా అమలయ్యేందుకు జాగ్రత్తలపై అధికారులతో మంత్రి చర్చించారు. అమ్మఒడి వాహనాల్లో గర్భిణులను ఆస్పత్రులకు తీసుకెళ్లడం.. ప్రసవం తర్వాత సురక్షితంగా బాలింతలను ఇంటికి తీసుకెళ్లడం జరుగుతున్నది. ఈ వాహనాల్లో అత్యసేవర సేవల కింద ప్రత్యేక సదుపాయాలు కల్పించారు.

999
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles