కాలం చెల్లిన ఇంజెక్షన్ల వినియోగంపై మంత్రి స్పందన

Sun,March 26, 2017 03:18 PM

Minister Laxmareddy responds on Injections in Gandhi Hospital

హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రిలో కాలం చెల్లిన ఇంజెక్షన్ల వినియోగంపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి స్పందించారు. ఆస్పత్రికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని డీఎంఈ రమణికి మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాల మేరకు డీఎంఈ విచారణ చేపట్టారు. అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న పిల్లలకు కాలం చెల్లిన ఇంజెక్షన్లు ఇచ్చిన ఇద్దరు స్టాఫ్ నర్సులు శోభ, సునీతను డీఎంఈ సస్పెండ్ చేశారు. జూనియర్ డాక్టర్ నవీన్ సింగ్‌కు మెమో జారీ చేశారు.

ఈ సందర్భంగా డీఎంఈ రమణి మాట్లాడుతూ.. ఆస్పత్రిలో కాలం చెల్లిన ఇంజక్షన్లు వాడటం లేదని ఆ ఆస్పత్రి స్పష్టం చేశారు. కాలం చెల్లిన మందులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసినవి కావు అని తెలిపారు. మందులు కావాలనే బయట నుంచి తెచ్చారని తెలిపారు. మందులు ఎవరు తీసుకొచ్చారనే విషయంపై ఇద్దరు నిపుణులైన వైద్యులతో కమిటీ వేశామన్నారు. రెండు రోజుల్లో కమిటీ నివేదిక ఇస్తుందన్నారు. ప్రస్తుతం పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేశారు. వైద్యాన్ని వక్రీకరించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఇప్పటి నుంచి ఆస్పత్రిలోకి రోగితో ఒకరిని మాత్రమే అనుమతిస్తామని పేర్కొన్నారు. మెడిసిన్ ఆస్పత్రిలోకి ఎలా వచ్చిందో విచారణ జరిపిస్తున్నామని తెలిపారు.

నగరంలోని బన్సీలాల్‌పేటకు చెందిన నలుగురు పిల్లలు గత వారం రోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ పిల్లలకు శనివారం సాయంత్రం నర్సులు ఇంజెక్షన్లు ఇచ్చారు. కాసేపటికే పిల్లలకు వాంతులు, చెమటలు వచ్చాయి. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించగా.. వారికి విరుగుడు ఇంజెక్షన్లు ఇవ్వడంతో ప్రాణాపాయం తప్పింది.

800
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles