ఆకుపచ్చ తెలంగాణ ఆవిర్భవిస్తుంది : లక్ష్మారెడ్డి

Wed,July 12, 2017 10:56 AM

Minister Laxmareddy planted plants in Balanagar

మహబూబ్ నగర్ : జిల్లాలోని బాలానగర్ లో మూడో విడత హరిత హారం కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మొక్కలు నాటిన మంత్రి.. మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్ లో ఆకుపచ్చ తెలంగాణ ఆవిర్భవిస్తుందని చెప్పారు. ఉద్యమంలా హరితహారం కొనసాగుతున్నదని తెలిపారు. తెలంగాణలో 24 శాతం ఉన్న అడవులను 33 శాతానికి పెంచడానికి సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా హరితహారంను చేపట్టారు. ఇలాంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. మొక్కలు వృక్షాలై, వానలు బాగా పడి, పచ్చని పంటలతో తెలంగాణ తులతుగాలని కేసీఆర్ భావిస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా సీఎం కేసీఆర్ హరిత హారం కార్యక్రమానికి పూనుకున్నారని తెలిపారు. ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలను నాటే లక్ష్యంతో హరిత హారం చేపట్టామన్న ఆయన.. ప్రతి మొక్కను ఎండిపోకుండా కాపాడే బాధ్యత అందరిపైనా ఉందన్నారు మంత్రి.

1671
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles