టీఆర్‌ఎస్ మేనిఫెస్టోను కాంగ్రెస్సే కాపీ కొట్టింది

Thu,October 18, 2018 02:15 PM

Minister Laxmareddy fire on Congress party leaders in mahaboobnagar dist

మహబూబ్‌నగర్ : జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల నిర్వాకం వల్లే పాలమూరు జిల్లాకు వలసల జిల్లాగా పేరు వచ్చిందన్నారు. గత పాలకులు సాగునీటి ప్రాజెక్టులను పెండింగ్ ప్రాజెక్టులుగానే ఉంచారని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ మేనిఫెస్టోను కాంగ్రెస్ కాపీ కొట్టిందని తెలిపారు. టీఆర్‌ఎస్ రూ. లక్ష రుణమాఫీ చేస్తే.. కాంగ్రెస్ రూ. 2 లక్షలు చేస్తామని అంటోంది. తాము రూ. వెయ్యి పింఛను ఇస్తే.. కాంగ్రెస్ రూ. 2 వేలు ఇస్తామని చెప్పింది. కాంగ్రెస్, టీడీపీలను ప్రజలు ఎవరూ నమ్మరు అని స్పష్టం చేశారు. పాలమూరు జిల్లాకు ఇప్పుడిప్పుడే మంచి రోజులు వచ్చాయి. అభివృద్ధి నిరాటంకంగా కొనసాగాలంటే టీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలి. వచ్చే రెండేళ్లలో పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని ఉద్ఘాటించారు. పాలమూరు జిల్లాలో 14 స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలుస్తుందని మంత్రి లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

2004
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS