వైద్య ఆరోగ్యశాఖపై మంత్రి లక్ష్మారెడ్డి సమీక్ష

Thu,June 29, 2017 07:25 PM

Minister laxmareddy do review on Medical and health department

హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖపై సంబంధిత అధికారులతో మంత్రి లక్ష్మారెడ్డి సచివాలయంలో సమీక్ష చేపట్టారు. సమావేశంలో క్లినికల్ పరీక్షలు, రక్తనిధి కేంద్రాలు-సురక్షిత నిర్వహణ, కేసీఆర్ కిట్లు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం, వైద్య విధానపరిషత్‌లో అదనపు పోస్టులు, ఖాళీల భర్తీ, జికా నివారణ వంటి తదితర అంశాలపై మంత్రి చర్చించారు. భేటీ సందర్భంగా క్లినికల్ పరీక్షల నియంత్రణపై కమిటీ వేయాలని నిర్ణయించారు. అదేవిధంగా మనుషులపై ఔషధ ప్రయోగ విధానంలో చట్టాలు కఠినతరం చేయాలని యోచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..

రక్తనిధి కేంద్రాలు సక్రమ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని.. రక్తనిధి కేంద్రాలలో ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి స్థల పరిశీలన, తాజా పరిస్థితులపై చర్చించిన మంత్రి వేగంగా స్థలాలు పరిశీలించి ఖరారు అయ్యేట్లు చూడాలన్నారు. స్థలాల గుర్తింపు కేటాయింపు పూర్తికాగానే శంకుస్థాపనలకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. కేసీఆర్ కిట్లు పథకాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారన్న మంత్రి కేసీఆర్ కిట్లు పథకం సక్రమంగా అమలు చేయాలన్నారు. పోస్టుల ఖాళీలు, అవసరం ఉన్న పోస్టుల వివరాలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. సీఎం ఆమోదంతో నియామకాల ప్రక్రియను చేపడతామని వెల్లడించారు. జికా వైరస్ సోకే అవకాశం ఉన్నందున చర్యలు చేపట్టాలని.. వ్యాధి నివారణకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు.

1133
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles