ఏఎన్‌ఎంలకు ట్యాబ్‌లు పంపిణీ చేసిన మంత్రి లక్ష్మారెడ్డి

Tue,February 28, 2017 05:18 PM

minister laxmareddy distributed tabs to anms

హైదరాబాద్: వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఏఎన్‌ఎంలకు గర్భిణీలు, బాలింతలు, పిల్లల ఆరోగ్య వివరాల నమోదు కోసం ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ఎప్పటికపుడు వారి వివరాలు ట్యాబ్‌లో నమోదు చేయాలని మంత్రి ఆదేశాలు జారీచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనవసర ఆపరేషన్లు చేసే ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఆస్పత్రి ప్రతి నెలా..శస్త్రచికిత్సల నివేదికలను ప్రభుత్వానికి పంపాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రుల్లో 500 లేబర్ రూములు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు.

1182
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles