ఇంగ్లాండ్ హాస్పిటల్స్ మీద వైద్య మంత్రి లక్ష్మారెడ్డి అధ్యయనం

Wed,July 18, 2018 07:25 PM

minister laxma reddy researches hospitals in UK

లండన్: యునైటెడ్ కింగ్‌డమ్‌(ఇంగ్లాండ్) పర్యటనలో ఉన్న వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి ఆ దేశ హాస్పిటల్స్ మీద అధ్యయనం చేస్తున్నారు. లండన్ లోని పలు హాస్పిటల్స్‌ని మంత్రి సందర్శిస్తున్నారు. అలాగే ఆయా హాస్పిటల్స్‌లోని ట్రీట్మెంట్, ప్రాక్టీసెస్‌ని పరిశీలిస్తున్నారు.

మంత్రి లక్ష్మారెడ్డి లండన్ లోని జార్జ్ ఎలియట్ హాస్పిటల్, లండన్ యూనివర్సిటీ హాస్పిటల్, NHS ట్రస్ట్ యూనివర్సిటీ హాస్పిటల్, కాన్వెంటీ అండ్ వార్విక్ షైర్ హాస్పిటల్స్ ని మంత్రి సందర్శించారు. ఈ సందర్బంగా మంత్రి ఆయా హాస్పిటల్స్ లో ప్రజలకు అందిస్తున్న వైద్య సదుపాయాలు చూశారు. అక్కడ ట్రీట్మెంట్, ప్రాక్టీసెస్ ని పరిశీలించారు. అక్కడి వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్స అందించే విధి, విధానాలను స్వయంగా చూశారు. అక్కడి వైద్య ప్రముఖులతో చర్చించారు. కాన్సర్ వంటి వ్యాధుల మీద అక్కడి వైద్యులు కనబరుస్తున్న శ్రద్ధను పరికించారు. మనకంటే మెరుగైన మంచి వైద్య పద్ధతులను అవలోకించారు.

ఈ సందర్బంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, వైద్యం విశ్వ వ్యాప్తం అయిందన్నారు. రోగాలు, వైద్య చికిత్సలలో కొన్ని తేడాలు ఉన్నాయన్నారు. అయితే, మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రపంచంలో ఎక్కడ మెరుగైన పద్ధతులు ఉన్నా వాటిని అనుసరించడం మంచిదే అన్నారు. అందుకే తాము లండన్ లో హాస్పిటల్స్ ని సందర్శించామని చెప్పారు. తెలంగాణని ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్ తపన పడుతున్నారని అన్నారు. ఇప్పటికే ప్రపంచ స్థాయి వైద్యాన్ని మన రాష్ట్రంలో అందిస్తున్నామని చెప్పారు. ఇంకా మెరుగైన, సమర్ధవంతమైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తున్నామని మంత్రి వివరించారు.


1828
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles