అనైతిక పొత్తు పార్టీలకు ప్రజలే బుద్ధి చెప్పండి..

Wed,September 12, 2018 09:14 PM

minister laxma reddy fire on congress and tdp

జడ్చర్ల:అనైతిక పొత్తుల తో అరిష్టాలు వస్తాయని, అధికారం కోసం దిగజారే పార్టీలతో ప్రగతి సాధ్యం కాదని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అన్నారు. బద్ధ శత్రుత్వంతో ఉన్న కాంగ్రెస్- టీడీపీలు కేవలం అధికారం కోసమే తప్ప ప్రజల మేలు కోసం కలవడం లేదని అన్నారు. టీడీపీ అవిర్భావమే కాంగ్రెస్ అవినీతికి వ్యతిరేకంగా జరిగిందన్నారు. అయితే కేవలం ప్రజల అభ్యున్నతి కోసం పని చేస్తున్న టీఆఎస్ కు వ్యతిరేకంగా వాళ్ళు కలుస్తున్నారని చెప్పారు. అది నచ్చక టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్న సీనియర్ నేత సతీష్ టిఆర్ఎస్ లో చేరడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా జడ్చర్లలో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. టీఆరెస్ ప్రభుత్వం ఈ నాలుగున్నరేళ్ళల్లో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. అభివృద్ధి కార్యక్రమాల్ని చూసి ప్రతిపక్షాల కళ్ళు బైర్లు కమ్మాయన్నారు. వాళ్లకు కంటి వెలుగు పథకం కింద ఉచితంగా పరీక్షలు చేయించి అద్దాలు ఇవ్వాలన్నారు. ప్రజల్లో చైతన్యం వచ్చిందని, ప్రతిపక్షాల పన్నాగాలే కాదు, ప్రభుత్వ పని తీరుని కుడా పరిశీలిస్తున్నారన్నారు. మంచి చెడులను ఎంచి ఓటు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సంగీత నాటక అకాడెమీ చైర్మన్ శివకుమార్, స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. సతీశ్ తో పాటు ఆయన అనుచరులకు మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

184
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles