సేవ చేసి ఓట‌రు దేవుళ్ళ రుణం తీర్చుకుంటా: ల‌క్ష్మారెడ్డి

Sun,September 23, 2018 04:40 PM

minister LAXMA reddy election campaign at Jadcherla constitution

మహబూబ్ నగర్ ఓట్ల కోసం నోట్లిచ్చే నేత‌ల్ని చూస్తున్నాం. అక్క‌డ‌క్క‌డా నోట్లిస్తే ఓట్లేస్తామ‌నే వాళ్ళ‌నీ చూస్తుంటాం. కానీ వీటికి విరుద్ధంగా ఓట్లు వేస్తాం.... ఇదిగో మీ ప్ర‌చార ఖ‌ర్చుల కోసం నోట్లూ ఇస్తాం అనే వాళ్ళని చాలా అరుదుగా చూస్తాం. ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా జ‌డ్చ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం రాజాపూర్‌లో జ‌రిగింది. వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి త‌న ప్ర‌చారంలో భాగంగా ఆదివారం రాజాపూర్‌కి వెళ్ళారు.అక్క‌డ భారీ ఎత్తున వాల్మీకి, ర‌జ‌క సంఘాల నేత‌లు, స‌భ్యులు టిఆర్ఎస్‌లో చేరారు. ఈ సంద‌ర్భంగా వారిలో నుంచి రాజాపూర్‌కి చెందిన పాల్కొండ వెంక‌ట‌య్య‌, కురుగుల రాములు మంత్రి కూర్చున్న వేదిక వ‌ద్ద‌కు వ‌చ్చారు. తమ‌ వ‌ద్ద‌నున్న రెండు వేల‌ రూపాయల‌ను మంత్రి చేతుల్లో పెట్టారు.

టిఆర్ఎస్ విజ‌యానికి త‌మ ఓట్లు వేస్తామ‌ని చెప్పారు. అలాగే మంత్రి ప్ర‌చార ఖ‌ర్చుల నిమిత్తం త‌మ‌ డ‌బ్బులు రెండు వేల‌ను మంత్రికి విరాళంగా ఇస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. దీంతో అక్క‌డున్న వాళ్ళంతా క‌ర‌త‌ళా ధ్వ‌నుల‌తో పాల్కొండ వెంక‌ట‌య్య‌, కురుగుల రాములును అభినందించారు. ఆ వెంట‌నే మంత్రి ల‌క్ష్మారెడ్డి మాట్లాడుతూ, త‌న‌కు, పార్టీకి ఓటు వేస్తాన‌న‌డ‌మేగాక‌, డ‌బ్బులు కూడా ఇచ్చిన పాల్కొండ వెంక‌ట‌య్య‌, కురుగుల రాములును అభినందించారు.

త‌న జీవితంలో ప్రాణం ఉన్నంత వ‌ర‌కు ప్ర‌జాసేవ‌లోనే ఉంటాన‌ని, పేద ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తుంటాన‌న‌ని చెప్పారు. త‌న‌కు అండ‌గా నిలిచిన  ప్ర‌జ‌ల్ని ఎప్పుడూ మ‌ర‌వ‌న‌ని, రుణ ప‌డి ఉంటాన‌ని చెప్పారు. సేవ చేసి ఓట‌రు దేవుళ్ళ రుణం తీర్చుకుంటాన‌న్నారు.

1109
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS