ప్రవళిక మృతిపై రాద్ధాంతం సరికాదు: మంత్రి లక్ష్మారెడ్డి

Tue,February 7, 2017 02:13 PM

minister lakshma reddy explanation on gandhi, neiloufer hospitals incidents

హైదరాబాద్: గాంధీ ఆసత్రి, నీలోఫర్ ఆస్పత్రుల్లో జరిగిన సంఘటనలపై మంత్రి లక్ష్మారెడ్డి స్పందించారు. ఈమేరకు ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. గాంధీ ఆస్పత్రిలో ప్రవళిక మృతిపై రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. ప్రవళిక మృతికి వైద్యుల నిర్లక్ష్యం కారణం కాదని తెలిపారు. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతోన్న ప్రవళిక చనిపోతుందని తల్లిదండ్రులకు ముందే తెలుసని వివరించారు. గ్లూకోజ్ బాటిల్‌లో పురుగులు ఉండే అవకాశమేలేదన్నారు. నీలోఫర్‌లో జరిగిన ఘటనపై కూడా ఆదేశించామని తెలిపారు. ప్రాథమిక వైద్య శాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించామని అన్నారు. త్వరలోనే అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలిసిస్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

1288
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles