మొజాంజాహి మార్కెట్‌ను సందర్శించిన కేటీఆర్

Mon,April 16, 2018 04:55 PM

Minister KTR visits MJ Market

హైదరాబాద్ : నగరంలోని మొజాంజాహి మార్కెట్‌ను ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం మధ్యాహ్నం సందర్శించారు. ఈ మార్కెట్ ప్రస్తుత పరిస్థితి, చేపట్టాల్సిన పనులపై కేటీఆర్ అధికారులతో సమీక్షించారు. రూ. 10 కోట్లతో ప్రాథమిక అంచనాతో పునరుద్ధరణ పనులకు జీహెచ్‌ఎంసీ ప్రణాళిక రచించింది. మంత్రి కేటీఆర్ వెంట పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్‌తో పాటు పలువురు అధికారులు ఉన్నారు. మొజాంజాహి మార్కెట్ ప్రాంత పునరుద్ధరణ పనులను అరవింద్ కుమార్ చేపట్టనున్నారు. మొజాంజాహి మార్కెట్‌లోని ఫేమస్ ఐస్‌క్రీం సెంటర్లో మంత్రి ఐస్‌క్రీం రుచి చూశారు.
1782
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS