సిరిసిల్లలో కేటీఆర్ గ్రాండ్ విక్టరీ

Tue,December 11, 2018 03:28 PM

minister KTR victory from Siricilla

హైదరాబాద్ : సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ ఘన విజయం సాధించారు. 87,565 ఓట్ల మెజార్టీతో కేటీఆర్ విజయ కేతనం ఎగురవేశారు. ఇక్కడ కాంగ్రెస్ తరపున కేకే మహేందర్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో కేటీఆర్ 171 ఓట్ల స్వల్ప మెజార్టీతో మహేందర్‌రెడ్డిపై గెలుపొందారు. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో అదే మహేందర్‌రెడ్డిపై 68,220 ఓట్ల మెజార్టీ సాధించారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కొండూరు రవీందర్‌రావుపై కేటీఆర్ 53,004 ఓట్ల మెజార్టీతో గెలుపొంది సిరిసిల్ల అభివృద్ధి అహర్నిశలు కృషి చేశారు.

1997
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles